
– జాగృతి మహిళా నాయకుల ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై.., ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో రగడ కొనసాగుతోంది. అటు మల్లన్నపై దాడిని నిరసిస్తూ బీసీ సంఘాలు, కవిత(KAVITHA)పై అతడి వ్యాఖ్యలను ఖండిస్తూ జాగృతి మహిళా కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో సోమవారం తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకుల ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేయడానికి వస్తే చైర్ పర్సర్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై, మహిళా లోకంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MALLANNA)పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు తీసుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట బైటాయించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
……………………………………….