* ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల ఆందోళన
ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పంజాబ్(PANJAB), హర్యానా(HARYANA) సరిహద్దు వద్ద నిరసన చేపడుతున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్(TIYOR GAS) ప్రయోగించారు. రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ(DELHI) వరకు చేపట్టిన చలో మార్చ్ ను గ్రేటర్ నోయిడాలోని పారి చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సెంట్రల్ ఢిల్లీ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. రైతులు అధిక సంఖ్యలో తరలిరావడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంబాలలో నిషేధిత ఆజ్ఞలు ఉన్నప్పటికీ, దాదాపు 500 మంది రైతులు(FORMERS) శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.
………………………………..