
* ప్రజాస్వామ్యం ఎలా ఉందో చెప్పేందుకు గుడివాడ ఘటనే నిదర్శనం
* అధికారులు చేతిలో ఉన్నారని ఏం చేసినా చెల్లుతుందా?
* ఇది ప్రజాస్వామ్యమేనా
* నటనలో చంద్రబాబు ఎన్టీఆర్ ను మించి పోయారు
* తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ప్రెస్మీట్
ఆకేరు న్యూస్, తాడేపల్లి : చంద్రబాబు పాలనలో ఏపీలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేతిలో ఉన్నారని ఆయన ఏం చేసినా చెల్లుతుం దా అని ప్రశ్నించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన తాడేపల్లి లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి భయపడి అధికారులు వీఆర్ ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారని తెలిపారు. చెప్పిన మాట వినని అధికారులపైనా కేసులు పెడుతున్నారు. డీసీ స్థాయి అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సరిగ్గా ఉంటే నేరాలు చేసిన వారు రాష్ట్రాన్ని వదలివెళ్లాలి కానీ, ఏపీలో అధికారులు వెళ్లిపోతున్నారని వివరించారు. డీఐజీ ఆధ్వర్యంలో అవినీతి దందా నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ఏవిధంగా ఉందో చెప్పడానికి గుడివాడ ఘటనే ఉదాహరణ అని తెలిపారు. టీడీపీ సైకోలు ఉప్పాల హారిక కారుపై దాడి చేశారని అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఘోరాలన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని తెలిపారు. స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు, మహిళపైనే అంతటి ఘోరానికి పాల్పడ్డారన్నారు. పైగా ఆమెను మహానటి అని విమర్శిస్తున్నారు..ఎవరు నటులు అని ప్రశ్నించారు. తిరిగి హారిక భర్త రాముపైనే తప్పుడు కేసు పెట్టారని, రాము కారుతో గుద్దారని కేసు పెట్టారని అని అన్నారు. ప్రభుత్వ కారులో ప్రభుత్వ డ్రైవర్ కారు నడుపుతుంటే వెనుక కూర్చున్న రాము కారుతో గుద్దాడని తప్పుడు కేసు పెట్టారని అన్నారు. ఒక బీసీ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమేనా అన్నారు. దానవీర శూర కర్ణ కన్నా గొప్పగా నటిస్తున్నారని, చంద్రబాబు లైవ్ నటన చూసి ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోయారని వెల్లడించారు. నటనలో ఆయన ఎన్టీఆర్ నే మించిపోయారని ఎద్దేవా చేశారు. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను వైసీపీ ఎప్పటికప్పుడు ఎండగడుతోందన్నారు.
………………………………………………