Hyderabad Weekly Bus Pass TGSRTC
* హైదరాబాద్‌లో కొత్త వీక్లీ బస్ పాస్ ప్రారంభం
* ఏసీ సిటీ బస్సుల్లోనూ ప్రయాణించే అవకాశం..
* పుష్పక్ బస్సులకు మినహాయింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నగర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారి సౌకర్యార్థం రూ.600కే ఏడు రోజుల పాటు అపరిమితంగా ప్రయాణించే వీక్లీ బస్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్‌తో నగరంలో తరచూ ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులకు ప్రయోజనం కలగనుంది.
* ఏడు రోజుల పాటు అన్లిమిటెడ్ జర్నీ
కొత్త వీక్లీ బస్ పాస్ కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సాధారణ సిటీ బస్సులతో పాటు ఏసీ సిటీ బస్సుల్లోనూ ఈ పాస్‌తో ప్రయాణించవచ్చు. అయితే, పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సులకు ఈ పాస్ వర్తించదు.
* ఎక్కడ కొనుగోలు చేయాలి?
ప్రయాణికులు నగరంలోని సిటీ బస్ పాస్ కౌంటర్లలో ఈ పాస్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే, TGSRTC అందుబాటులోకి తెచ్చిన ‘మీటికెట్’ డిజిటల్ టికెటింగ్ యాప్ ద్వారా కూడా వీక్లీ పాస్ పొందే సౌకర్యం ఉంది.
* ప్రయాణికులకు ఊరట
నగరంలో వారం రోజుల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ప్రతిసారీ టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యంగా ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

