AP Cyclone Alert
* బంగాళాఖాతంలో వాయుగుండం.. తీర ప్రాంతాలకు టెన్షన్
* బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. విశాఖపట్నానికి సుమారు 860 కిలోమీటర్లు, కాకినాడకు 950 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.
ఈ వాయుగుండం రేపు తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా. తుఫాన్‌గా బలపడిన అనంతరం దీనికి ‘అర్నాబ్’గా నామకరణం చేయనున్నట్లు సమాచారం. ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
* ఏపీకి భారీ వర్ష సూచన..
తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తుఫాన్ బుధవారం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
* గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు..
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారుల సూచనలు పాటించాలి. తీరప్రాంత ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

