Thatikonda Crossroad Car Fire
* తాటికొండ క్రాస్‌రోడ్డులో కారు దగ్ధం..తృటిలో తప్పిన ప్రాణాపాయం!
* ఇంజిన్ నుంచి ఎగిసిపడిన మంటలు.. క్షణాల్లోనే కారు పూర్తిగా బూడిద
* కారులో ఇద్దరు అప్రమత్తమై బయటపడటంతో తప్పిన ముప్పు
* ఆలస్యంగా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
* కారు దగ్ధంతో రహదారిపై భారీగా స్తంభించిన ట్రాఫిక్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ఘటన స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur) మండలం తాటి కొండ క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. హన్మకొండలోని సుబేదారికి చెందిన ఎండీ అన్వర్ హుస్సేన్ మరో వ్యక్తితో కలిసి డస్టర్ డీజిల్ కారులో మల్లన్న గండికి బయలుదేరారు. హన్మకొండ నుంచి స్టేషన్ ఘన్పూర్ మీదుగా పల్లగుట్ట రోడ్డు క్రాస్‌రోడ్డు వైపు వెళ్తు న్న క్రమంలో తాటికొండ క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తు కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. అప్రమత్తమైన ఇద్దరు ప్రయాణికులు వెంటనే కారు నుంచి బయటకు రావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే మంటలు కారంతటా వ్యాపించడంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. నిన్ననే కారుకు కొత్తగా ర్యాపింగ్ చేయించగా, మరుసటి రోజే అగ్నిప్రమాదానికి గురై కారు దగ్ధం కావడం గమనార్హం.
* ఫైర్ సిబ్బంది రాకలో జాప్యం.. నిలిచిన ట్రాఫిక్!
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందిం చినప్పటికీ, సుమారు 30 నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. రహదారిపై కారు మంటల్లో కాలిపోవడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొద్ది

Please tell us what is wrong. Your report will be sent to the website team.

