
* కారులో చెలరేగిన మంటలు
ఆకేరున్యూస్ హనుమకొండ: సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న వేం నరేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి.. సోమ్లాతండా వద్ద వేం నరేందర్ రెడ్డి కారులో హెలీప్యాడ్ వద్దకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని ఓ కారులో మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వేం నరేందర్ రెడ్డిని అక్కడనుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు.
………………………………………