* సైన్‌బోర్డుపై పుల్ అప్స్
ఆకేరు న్యూస్, ఉత్తర్‌ప్రదేశ్: సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చాలామంది తెగ ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకొంది. రహదారిపై ఉండే సైన్‌బోర్డు పైకి ఎక్కి ఓ యువకుడు పుల్ అప్స్ తీస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అమేఠీలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు ప్రమాదకర స్టంట్లకు పాల్పడ్డాడు. రోడ్డుపై ఉండే సైన్బోర్డుపైకి ఎక్కి నేల నుంచి 10 మీటర్లకు పైగా ఎత్తులో వేలాడుతూ స్టంట్లు చేశాడు. మరో యువకుడు కూడా పైకి ఎక్కి అతడిని వీడియో తీశాడు. ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలు గాలిలో కలిసేవి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఇలాంటి స్టంట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
……………………..