
* ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది
* జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
* ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణ పోరాట యోధుల స్పూర్తితో రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనను తెచ్చుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బ్లిక్ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల నిర్ణయమే ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. బంధుప్రీతి అశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నామని రేవంత్ అన్నారు. సామాజిక న్యాయంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు.ఉన్నత చదువుల ద్వారా యువత తమ ప్రతిభను చాటాలని సూచించారు. రానున్న రోజుల్లో విద్యా విధానంతో పాటు పాఠశాలల రూపురేఖలు కూడా మరబోతున్నాయని పేర్కొన్నారు. రైతులకోసం తెస్తున్న పథకాలు కొత్త ఒకవడిని సృష్టిస్తున్నాయని అన్నారు. మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చి వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు . పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించమని,. సివిల్స్ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలను సరిదిద్దామని తెలిపారు.
గేట్వే ఆఫ్ వరల్డ్..
ప్రపంచంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందని హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దుతామని రేవంత్ అన్నారు. 2047 నాటికి మన రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఎదగాలన్నారు. హైదరాబాద్ ను కాలుష్యంలేని నగరంగా మారుస్తున్నామన్నారు..
పర్యాటకులను ఆకర్శించే విధంగా మూసీ పరిసరాలను తీర్చిదిద్దుతామని అన్నారు.
నదీ జలాలపై రాజీ పడేది లేదు
కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీపడేదిలేదని రేవంత్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాం. ఎస్ెల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తాం. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదు. డిసెంబర్ 9న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసి ముందుపెడతాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దేశానికి గొప్ప నగరం నిర్మించానే ఉద్దేశంతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కి రూపకల్పన చేశామని రేవంత్ అన్నారు.
……………………………………………………….