* బోనస్, రైతుబంధు ఇస్తానని బాండ్ పేపర్ రాసి మాట తప్పావా లేదా
* లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తామని మహిళలను మోసం చేశావ్
* సీఎంకు మందుపై ప్రేమ ఎక్కువైంది..
* రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
* మునుగోడులోని వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శన
ఆకేరు న్యూస్, నల్గొండ : రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే.. మహారాష్ట్రకు వెళ్లి అక్కడ నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు(Ex minister Harishrao) మండిపడ్డారు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసి రైతులకు 500 బోనస్, 15000 రైతుబంధు ఇస్తానని చెప్పి మాట తప్పావా లేదా అని ప్రశ్నించారు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమిస్తామని చెప్పి మోసం చేసారని, భర్తలకు మద్యం తాగించి ఇల్లు గుల్ల చేయాలని చూసి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా (Nalgonda District)మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే, ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. సాగు పెరిగిన కారణంగా నల్గొండ జిల్లాలో ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదని విమర్శించారు.
ధాన్యం దళారుల పాలు
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయిందని హరీశ్‌రావు అన్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేక, గన్నీ బస్తాలు అందించలేక రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రైతులు రూ .1800లకు క్వింటాల్ చొప్పున దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్గొండ జిల్లాలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, 200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే అందులో 50 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. వడ్లకు మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నిన్న జగిత్యాల జిల్లా(Jagityala) పర్యటనలో అక్కడి రైతులని అదిగితే ఒక కిలో సన్నవడ్లు కూడా కొనలేదని చెప్పారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో కూడా ఒక కిలో సన్న వడ్లను కొనలేదని వెల్లడించారు.
మందు అమ్మకాలకు టార్గెట్
సన్న వడ్లను కొనే వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ విప్లమైందని, ముఖ్యమంత్రికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైందని హరీశ్ వెల్లడించారు. వడ్లు కొనకపోతే అధికారులను మిల్లర్లను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కానీ. మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారన్నారు. మందు అమ్మకాల టార్గెట్(Liquor Targets) పెట్టి జనాలకు మందు ఎక్కువ తాగించి ఆదాయం పెంచాలని ఒత్తిడి చేస్తూ మెమోలిస్తూ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని ఆరోపించారు. 25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారని ఆరోపించారు. లంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చావు కానీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి మహిళల పుస్తెల్లు తెంపుతున్నావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోసాలే మోసాలు..
మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమిస్తామని చెప్పి మోసం చేసావ్.. వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మహిళలకు అందజేయడం లేదు..
మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమిస్తామని చెప్పి మోసం చేసావ్.భర్తలకు మద్యం తాగించి ఇల్లు గుల్ల చేయాలని చూసి మహిళలను ఇబ్బంది పెడుతున్నావ్. రైతులకు పెట్టుబడి సాయం అందిందా లేదా రుణమాఫీ జరిగిందా లేదా సకాలంలో బోనస్ అందించారా లేదా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశారా లేదా అనే సోది లేదు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసావ్.. అంటూ రేవంత్ (Revanth)పై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
……………………………………………….