* 56 ఏళ్ల తర్వాత గయానాకు ప్రధాని
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM NARENDRA MODI) నవంబర్ 16 నుంచి 21 వరకూ రెండు ఖండాల్లోని మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా (NYZERIA) తో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, గయానా (BREZIL, GAYAANA) దేశాలను సందర్శించనున్నారు. మోదీ ముందుగా నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఈనెల 16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియా(NYZERIA)లో పర్యటించడం ఇదే తొలిసారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని తెలిపింది. నైజీరియా పర్యటనను ముగించుకొని ప్రధాని బ్రెజిల్ (BREZIL) పర్యటనకు వెళ్లనున్నారు.
నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొంటారు. గతేడాది జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆ సదస్సుకు బ్రెజిల్ వేదికైంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే జీ20 సమ్మిట్‌లో ప్రధాని పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. బ్రెజిల్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ గయానాకు వెళ్లనున్నారు. గయానీస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానాలో పర్యటించనున్నారు. 56 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో గయానా అధ్యక్షుడు మొహమ్మద్ అలీతో మోదీ చర్చలు జరపనున్నారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
