
* సంఘం ముందు కీలక ప్రతిపాదనలు
* రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తులు
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరణ
* పన్నుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని వినతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanthreddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Cm Batti Vikramarka) ప్రజాభవన్లో ఈ రోజు 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పలు ప్రతిపాదనలు ఆర్థిక సంఘం ముందుంచారు. పన్నుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర అప్పు 6.85 లక్షల కోట్లు ఉందని, కేంద్రం తగిన విధంగా సహకరించాలని కోరారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను మలుచుకునేలా స్వయంప్రతిపత్తి ఇవ్వాలని, కేంద్ర సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను పూర్తిగా వివరించారు. రైతు భరోసా, బీమా వివరాలను వెల్లడించారు. సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంంచి విజ్ఞప్తులు సేకరించిన ఆర్థిక సంఘం(Finance Commission) కాసేపట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
—————————–