* వియత్నాంలో చోటుచేసుకున్న దారుణం
* రెడ్ నదిలో పడిన ట్రక్కు, కార్లు, బైకులు.. 64 మంది మృతి
* యాగి తుఫాను రేపుతున్న విలయం
ఆకేరున్యూస్ డెస్క్ : వియత్నాం(Viyatnam)లో యాగి తుఫాను(Yagi Tufan) విలయం సృష్టిస్తోంది. అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫానుకు బలహీనపడిన ఉక్కు వంతెన అందరూ చూస్తుండగా రెడ్ నది(Red River)లో కుప్పకూలింది. వంతెనపై గుండా వెళ్తున్న ఓ ట్రక్కు, పది కార్లు, రెండు బైకులు నదిలో పడిపోయాయి. ఇప్పటి వరకు 64 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర కలకలం రేగుతోంది. ఫుథో ప్రాంతంలోని రెడ్ నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిన దృశ్యాలు సోషల్మీడియా(Social Media)లో వైరల్ గా మారుతున్నాయి. నదిలో పడ్డ వారిలో 13 మంది జాడ తెలియాల్సి ఉందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
