* వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేయాలి
* సీఎం రేవంత్రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్లు, అధికారులు ఆయన వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే పురోగతిపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
…………………………………………