Published:
Updated: 29 Nov 2024 • 05:05 AM
ఆకేరున్యూస్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు.
…………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
