* ఫైర్ సిబ్బంది దగ్గర ఆక్పిజన్ ఎక్విప్ మెంట్ లేదు
* ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి : కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రమాదం చిన్నదే అయినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సహాయ చర్యల్లో ఫైర్ సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ చర్యలు వెంటనే ప్రారంభించి ఉంటే బాగుండేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫైర్ సిబ్బందికి పరికరాలు ప్రభుత్వం అందించాలని, అగ్ని మాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన శిక్షణ ఇవ్వాలని కోరారు. ఫైర్ సిబ్బంది దగ్గర ఆక్పిజన్ ఎక్విప్ మెంట్ లేదన్నారు. అగ్నిమాపకశాఖ..సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని, బాధితులకు కేంద్రం తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తామని చెప్పారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
