
చిన్నారిని రక్షిస్తున్న వీడియో వైరల్.. నెటిజన్ల విమర్శలు తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
* అనుమానంతో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య
ఆకేరున్యూస్ హనుమకొండః తన భర్త వేరే అమ్మాయికి దగ్గరవుతున్నాడనే అనుమానంతో ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో చోటుచేసుకుంది. వివర్లోకి వెళితే భార్యాభర్తలయిన సృజన్ , ప్రత్యూషలు వృత్తి రీత్యీ డాక్టర్లు.. డాక్టర్ సృజన్ కార్డియాలజిస్ట్ గా ప్రాక్టిస్ చేస్తుండగా డాక్టర్ ప్రత్యూష డెంటిస్ట్ అయితే ఇటీవల డాక్టర్ సృజన్ కు ఓ యువతి సోషల్ మీడియాలో రీల్స్ ప్రమోట్ చేస్తూ డాక్టర్ సృజన్‌కు దగ్గయింది. ఈ నేపధ్యంలో సాన్నిహిత్యం ఎక్కువైంది. తన భర్త తనను పట్టించుకోకుండా ఆ యువతితో తిరుగుతున్నాడని మనస్తాపానికి గురై డాక్టర్ ప్రత్యూష ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.ఇదిలా ఉండగా తన కూతురు చావుకి అల్లుడు సృజన్ కారణమని మృతురాలు తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………….