
ఆకేరున్యూస్ భూపాలపల్లి : ఒకదాని వెనుక ఒకటిగా వెళ్తున్న రెండు టిప్పర్ లారీలు ఢీ కొట్టిన సంఘటన భూపాలపల్లి జిల్లా మేడిపల్లి వద్ద చోటుచేసుకుంది. భూపాలపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ లారీని దాని వెనుకే వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఓ లారీలో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కు పోగా మరో డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్ను స్థానికులు సమీప ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
……………………………………………….