* మాదకద్రవ్యాలు లేని తెలంగాణ ను భావితరాలకు అందిద్దాం
* డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
* మంత్రి సీతక్క వెల్లడి
ఆకేరు న్యూస్ ములుగు ః డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టి,మాదకద్రవ్యాలు లేని తెలంగాణను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీకి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఎస్పి షబరిష్, ఏఎస్పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, అదనపు ఎస్పి సదానందం, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్, వివిధ శాఖల అధికారులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
