* ఒకరి మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : గ్రీస్(Greece)లోని చారిత్రక నగరం ఏథెన్స్(Athence) సమీపంలో చెలరేగిన మంటలు 24 గంటలైనా ఇంకా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి ఒకరు మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా అగ్నికీలలు (Firekeys) అదుపులోకి రావడం లేదు. 152 ప్రత్యేక వాహనాలు, నీటిని చల్లే విమానాలను రంగంలోకి దించినా అగ్నికీలలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. దీంతో నీళ్లు చిమ్మే విమానాలను కూడా రంగంలోకి దించారు. కొన్నిచోట్ల అగ్నికీలలు 85 అడుగుల ఎత్తు ఉన్నట్లు స్థానికంగా కథనాలు వెలువడుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానిక మారథాన్ సహా ఇతర ప్రాంతాలవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, 2018లోనూ ఇలాంటి కార్చిచ్చే గ్రీస్‌లో అల్లకల్లోలం రేపింది. ఆ సమయంలో సముద్ర తీరంలో ఉన్న మాటి నగరం మొత్తం బూడిదైపోయింది. దాదాపు వంద మందికిపైగా మరణించారు. గ్రీస్ వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఇక్కడ కార్చిచ్చు( Wildfire) సాధారణం అయిపోయింది.
—————————