
* ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: గోదావరి ప్రభావం పెరిగిందాని, ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. శుక్రవారం ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం కరకట్టను, మంగపేట లోని పొదుమూరు కరకట్టను, వరద తీరాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వరద కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, సకాలంలో నివాస గ్రామాలను ఖాళీ చేయాల్సిన అవసరం తలెత్తిన పక్షంలో తగిన చర్యలు తీసుకోవడానికి, గోదావరి నదిలో నీటి మట్టాన్ని నిరంతరం పై అధికారులకు నివేదించాలని సాగునీటి శాఖ, ఎంపీడీఓ, తహసీల్దార్, సిబ్బందికి సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో తగినంత ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇర్రిగేషన్ ఈ ఈ జగదీశ్వర్, తహసిల్దార్ జగదీష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.