ఆకేరున్యూస్, తాడ్వాయి : ములుగు జిల్లా తాడువాయి మండలం లో మేడారంలో గల ఆదివాసి ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మల హుండీల ఆదాయం 36 లక్షలు వచ్చినట్లు మేడారం జాతర ఈవో వీరస్వామి తెలిపారు.బుధవారం సమ్మక్క సారలమ్మల కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల నిఘాలో పోలీసు బందోబస్తు నడుమ మార్చి నుంచి జూన్ వరకు భక్తులు సమర్పించిన కానుకల 20 హుండీ లను లెక్కించారు. ఇందులో సమ్మక్క దేవత హుండీలో ని ఆదాయం 18,36,233 రూపాయలు, సారలమ్మ దేవత హుండి ఆదాయం 1659383, పగిడిద్దరాజు హుండీ ఆదాయం 72,289, గోవిందరాజు హుండీ ఆదాయం 81 463 రూపాయలు వచ్చినట్లు ఆయన వివరించారు.మొత్తం హుండీల ఆదాయం 36,49363 వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధ బోయిన జగ్గారావు లతో పాటు పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు క్రాంతి కుమార్ ,మధు,రాజేశ్వరరావు, బాలకృష్ణ, వసంతరావు రెవెన్యూ పోలీస్ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
