
* జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: నీతి ఆయోగ్ సూచించిన ఆరు అంశాలుచిట్టచివర ఉన్న గోత్తి కోయగూడాలకు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం ఆకాంక్షా బ్లాక్, సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమానికి కలెక్టర్ . ముఖ్య అతిథిగా పాల్గొని
మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దేశంలోని 500 ఆకాంక్షా బ్లాకులలో (Aspirational Blocks) కన్నాయిగూడెం బ్లాక్ ఒకటి అని అన్నారు. సమిష్టి కృషి ఫలితంగా, అభివృద్ధి సూచికలలో గణనీయమైన ప్రగతిని సాధించామని తెలిపారు. సంపూర్ణత అభియాన్” అంటే కేవలం లక్ష్యాలను చేరుకోవడం కాదని, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో సంపూర్ణ అభివృద్ధిని సాధించడమని వివరించారు. ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరి సహకారంతోనే సాధ్యమైతదని అన్నారు. అధికారులు కేవలం విధులను నిర్వర్తించడమే కాకుండా, కన్నాయిగూడెం ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.
ప్రణాళికలు సమర్థవంతమైన అమలు వల్లే ఈ బ్లాక్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందనీ అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాలలో విశేష కృషి చేసిన జిల్లా, బ్లాక్ స్థాయి అధికారులను, వారి నిబద్ధతకు, అంకితభావానికి సత్కరించడం జరుగుతుందని అన్నారు. ఫ్రంట్లైన్ వర్కర్లకు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వి ఏ ఓ లు ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లు – మీరుచేసిన కృషివల్లే ఈ కార్యక్రమంలో విజయంసాధించడం జరిగిందనీ అన్నారు.
ఆకాంక్షా హాట్ ప్రారంభం…
“ఆకాంక్షా హాట్”. స్వయం సహాయక బృందాలు (SHG) తయారు చేసిన స్థానిక ఉత్పత్తులు, చేతివృత్తుల వస్తువులకు ఒక వేదిక కల్పించడమే ఆకాంక్షా హాట్ లక్ష్యం మని, మహిళా సాధికారతకు ఒక గొప్ప నిదర్శనం అన్నారు. ఆకాంక్షా హాట్ ద్వారా మహిళలు తయారు చేసిన వస్తువులకు మంచి మార్కెటింగ్ లభిస్తుందనీ, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని అన్నారు. వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందనీ, తద్వారా కుటుంబాలకు, సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు.ఆకాంక్షా హాట్ను సందర్శించి, మన స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, మన మహిళా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించాలని హితవు పలికారు. కన్నాయిగూడెం ఆకాంక్షా బ్లాక్ అభివృద్ధి కేవలం ఒక ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో ఇంకా అనేక లక్ష్యాలను సాధించాల్సి ఉందనీ, అధికారులు స్ఫూర్తితో ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకట నారాయణ, ఎం పి డి ఓ అనిత, ఎంపీఓ సాజిద,
నీతి అయోగ్ కో ఆర్డినేటర్ రవీష్ , ఎం ఈ ఓ, ఎం ఏ ఓ, మండల అధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్స్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..