* స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి ఎంతో కీలకం
* అమరావతి అంటే ఒకనగరం కాదు… ఒక శక్తి
* 60వేలకోట్ల పనులకు శంకుస్థపానలు
* అమరావతికి అన్ని విధాలా అండగా ఉంటాను
* అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోడీ
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీ ప్రజల చిరకాల స్వప్నం అమరావతి సాకారం కాబోతుందని ప్రధాని మోడీ అన్నారు. అమరావతి ఒక పుణ్యభూమి అని.. నేను ఈ పుణ్యభూమిపై నిలబడి విూ అందరితో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టిన ప్రధాని.. దుర్గాభవానీ కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు. తన ప్రసంగం మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఇవాళ దాదాపు రూ.60 వేల కోట్ల పనులకు శంఖుస్థాపనలు చేశా.. అయితే ఇవి కేవలం శంఖుస్థాపనలే కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదులని పేర్కొన్నారు. శుక్రవారం వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణ పనులను మోడీ ప్రారంభించారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. మోడీ చేతుల విూదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ.. ఏఐ, ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్ని రంగాల్లో అమరావతి కీలకంగా మారబోతుందని అన్నారు. అమరావతి ప్రతి వ్యక్తి కలల నిర్మాణమని.. త్వరలోనే వారి స్వప్నం సాకారం కాబోతుందన్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఐటీ విజన్ అద్భుతమని.. ఆయన ఐటీ విజన్‌ను నేను అప్పుడు గుజరాత్ సీఎంగా ఉండి పరిశీలించానని తెలిపారు. నాణ్యమైన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని ప్రశంసించారు. 2015లో అమరావతి నిర్మాణానికి నేనే శంఖుస్థాపన చేశా.. పదేండ్లు ఏపీ అభివృద్ధి కోసం సహకరించామని పేర్కొన్నారు. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాడుతుందన్నారు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వరస్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అమరావతిలో మౌలికవసతుల కల్పనకు కేంద్ర సహకరిస్తుందని చెప్పారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, మరో రాష్టాన్ర్రికి అనుసంధానం పెరుగుతుంది. ఈ అనుసంధానం తీర్థయాత్రలకు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్టాల్రకు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామన్నారు. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో నేను ఊహించగలనని.. అది ఏపీ రాష్ట్రం చరిత్ర గతిని మార్చబోతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేదికపై కేంద్రమంత్రులు వర్మ, చంద్రశేఖర్, రామ్మోమన్ నాయుడు, గవర్నర్ నజీబ్, సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్,మంత్రులు లోకేశ్, కేశవ్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
