
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏం ఆర్ పి ఎస్, వి హెచ్ పి ఎస్,ఎం ఎస్ పి తదితర సంఘాల నాయకులు పలువురు హాజరై మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6000/- కు పెంచాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగుల గర్జన ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులు ,వృద్దులు, వితంతువులు, అన్ని రకాలైన ఆసరా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 13 న నిర్వహించ తలపెట్టిన ఛలో హైదరాబాద్ పెన్షన్ దారుల గర్జనకు అందరికీ సంఖ్యలో రావాలని కోరారు. ప్రతి గ్రామంలో పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి కమిటీల నియామకం చేయాలని పిలుపునిచ్చారు. వితంతువులు,ఒంటరి మహిళలకు ప్రధాన పాత్ర పోషించేలా ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 13న ఛలో హైదరాబాద్ లో జరగబోయే వికలాంగుల మహా గర్జన విజయవంతంకై కనీ విని ఎరుగని స్థాయిలో ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏం ఎస్ పి నాయకులు మడిపెల్లి శ్యామ్ బాబు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు వాజేడు మండల ఇన్చార్జి పుల్లూరు కరుణాకర్ మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితిరాష్ట్ర నాయకులు కడారి సాంబయ్య మాదిగ కన్నయ్య గూడెం మండల ఇన్చార్జి నెమలి నరసయ్య మాదిగ నూగుర్ వెంకటాపూర్ మండలం ఇంచార్జి వావిలాల స్వామి మాదిగ ఎం.ఎస్.పి జిల్లా ఉపాధ్యక్షులు మరాఠీ రవీందర్ మాదిగ ఎంఎస్పి జిల్లా కార్యదర్శి కడప శ్యామ్ మాదిగ మంగపేట మండల ఇన్చార్జి గుగ్గుల సురేష్ మాదిగ వాజేడు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెన్నం స్వామి మాదిగ కన్నయ్య గూడెం మండల అధ్యక్షులు తిప్పనపల్లి వెంకటేష్ మాదిగ తాడువాయి మండల ఇన్చార్జి గోసంగి దుర్గారావు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సురేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..