* తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు
* ఏపీలోని 145 మండలాల్లో తీవ్ర వడగాలులు
* అప్రమత్తం అంటున్న వాతావరణ శాఖ
ఆకేరు న్యూస్ డెస్క్ : తీవ్ర వడగాలులతో తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఉక్కబోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. బయటకు వెళ్లాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. ఈనేపథ్యంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. 145 మండలాల్లో తీవ్ర వడగాలలు వీచే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఎండ వేడి ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని హైదరాబాద్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉప్పల్ లో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈక్రమంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
———————–