* ఘనంగా జయశంకర్ వర్దంతి
ఆకేరు న్యూస్,పాలకుర్తి ః తెలంగాణ సిద్దాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్ల ప్రొఫెసర్ జయశంకర్ పదిలంగా ఉన్నాడని పాలకుర్తి మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పాలకుర్తితో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో జయశంకర్ నిర్వహించిన పాత్ర మరువలేనిదని అన్నారు. ఆయన చేసిన సూచనలు,సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని యాకస్వామి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మారోజు ఉపేంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు గాంధారి సంపత్, మరోజు బిక్షపతి, ధర్డేపెల్లి గ్రామ అధ్యక్షుడు గుడిపెళ్ళి జలంధర్, రాగపురం గ్రామ అధ్యక్షుడు కాశోజు శుక్లాచారి, మారోజు సతీష్ చారి, నంచర్ల హరికృష్ణ, రాసమల్ల సంతోష్, మంచోజు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
