* యోగాతో వ్యాధులకు దూరం
* యోగా కోసం సమయం కేటాయించాలి
* జిల్లా కలెక్టర్ దివాకర
* ములుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఆకేరున్యూస్,ములుగుః ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన ఆరోగ్యవంతులవడమే కాకుండా ఆముష్షు కూడా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా చేయడం వలన మానసిక ప్రశాంతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల శారీరక రుగ్మతలకు లోను కాకుండా ఉంటారని అన్నారు. ప్రతీ రోజూ యోగా కోసం కొంత సమయం కేటాయించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గోపాల్ రావు ,జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ చంద్ర, డాక్టర్ సంధ్య (జిల్లా ఇన్చార్జ్) యోగ గురువు శివ కృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
