* కౌశిక్ రెడ్డిది బ్లాక్ మెయిల్ చరిత్ర
* కౌశిక్ ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు.
* ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు
* ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ఆకేరున్యూస్, హైదరాబాద్ ః కౌశిక్ రెడ్డిని గెలిపించినందుకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తూ వంచనకు గురి చేయడం కౌశిక్ నైజం అని బల్మూరి వెంకట్ అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎంతో మంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేశారని బల్మూరి ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ లు కౌశిక్‌కు మద్దతు పలకాడాన్ని బల్మూరి విమర్శించారు. టీఆర్ ఎస్ నేతల అసలు స్వరూపం ఇప్పుడు బయట పడుతోందని బల్మూరి అన్నారు.ఫోన్ ట్యాపింగ్ నిందితులను విదేశాలకు పంపినట్లుగా కౌశాక్ రెడ్డిని విదేశాలకు పంపించేందుకు బీఆర్ ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు,
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
