* మెగాస్టార్ చిరంజీవి
ఆకేరు సినిమా డెస్క్ : మీరు లేనిదే నేను లేను అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.. నేను ఇంత వాడిని అయ్యానంటే అభిమానుల అదరణే కారణమని పేర్కొన్నారు. మెగాస్టార్ సినియాల్లోకి వచ్చి 47 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మెగాస్టార్ నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు 22 సెప్టెంబర్ 1978లో రిలీజ్ అయింది. చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్లు కాని రిలీజ్ అయింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమా.. పునాది రాళ్లుతో గట్టి పునాది వేసుకున్న చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో సినిమాల్లో ప్రాణం పోసుకున్నాడు.. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మెగాస్టార్ గా నిలిచిపోయాడు..చిరంజీవి 47 ఏళ్లు సినిమా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈ నేపధ్యంలో చిరంజీవి సినీ ప్రయాణాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం.. ప్రాణం ఖరీదు సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న చిరంజీవి ఆ తరువాత వచ్చిన పునాదిరాళ్లు.. సినిమాతో మరింత దగ్గరయ్యాడు..కెరీర్ మొదట్లో వచ్చిన మన ఊరి పాండవులు,పున్నమినాగు,శుభలేఖ, మొదలైన సినిమాలు చిరంజీవిలో ఉన్న టాలెంట్ ను తెలుగుప్రేక్షకులకు పరిచయం చేశాయి. అప్పటి వరకు ఎన్టీఆర్, ఏఎన్నార్,,శోభన్ బాబు,,కృష్ణ,,కృష్ణంరాజులు తెలుగు సినిమాల్లో అగ్రహీరోలుగా చలామణి అవుతున్నారు. మూస పద్దతిలో యాక్షన్ చూసిన తెలుగు ప్రేక్షకులలకు చిరంజీవి ఓ ఝలక్ ఇచ్చాడు. డాన్సుల్లో కొత్త దనం ఫైట్లలో కొత్తదనం చిరంజీవి తెలుగుప్రేక్షకులకు పరిచయం చేశాడు.. చిరంజీవి రాకతో యువ ప్రేక్షకులందరూ చిరంజీవి వైపే టర్న్ అయ్యారని చెప్పాలి.. చాలెంజ్, అభిలాష, మంత్రిగారి వియ్యంకుడు,లాంటి సినిమాలతో ఎదుగుతూ వచ్చిన చిరంజీవి ఖైదీ సినిమాతో ఇక తిరుగులేని హీరో అయ్యాడు.. 47 ఏళ్లుగా తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ హీరోగా ఉన్న చిరంజీవి ఇంకా మూడేళ్లు అయితే చిరంజీవి సినిమా జీవితానికి 50 ఏళ్లు నిండుతాయి..
…………………………………………..
