* సిఎం రేవంత్‌తో కలసి అన్ని విషయాలు చర్చిస్తా
* రేవతి కుటుంబానికి అండగా నిలబడతాం
* కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని ప్రముఖ నిర్మాత, ఎఫ్డిసి ఛైర్మన్ దిల్‌రాజు అన్నారు. మంగళవారం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతోందనేది దుష్ప్రచారం మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని.. త్వరలోనే సినీ పరిశ్రమ ప్రతినిధులం వెళ్లి సీఎంను కలుస్తామన్నారు.. ఎలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాపై ఉందని దిల్ రాజు పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని దిల్ రాజు ప్రకటించారు. రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
