Banakacherla Supreme Court Petition
* బనకచర్ల వివాదం
* తెలంగాణ పిటిషన్పై నోటీసులకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
బనకచర్ల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలన్న తెలంగాణ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ పిటిషన్ లిస్ట్ అయిందని, ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా బెంచ్ ముందుకు రావడాన్ని కోర్టు తప్పుపట్టింది. రిజిస్ట్రీ రూల్స్ ప్రకారం ముందుగా చాంబర్ జడ్జి ముందే ఈ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం స్పష్టం చేసింది.
