
* డీజీపీకి హరీశ్‌రావు వినతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బెటాలియన్ కానిస్టేబుళ్ల సస్సెన్షన్‌పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీరును నిరసిస్తూ వరంగల్ (Warangal)జిల్లా మామునూరు ఫోర్త్ బెటాలియన్‌లో పలువురు కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. నల్గొండ(Nalgonda) 12వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్స్ సైతం ఆందోళనకు దిగారు. కాగా, బెటాలియన్ కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిబంధనలను ఆకస్మికంగా సవరించి వారికి అన్యాయం చేశారని, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులను సహచర పోలీసులే అరెస్ట్ చేసినప్పుడు, పోలీసులు ఏమి చేయాలని ప్రశ్నించారు. ఆ 39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
……………………………………………………..