* నిజాలు వెల్లడించాలన్న ఎంపీ రఘునందన్‌రావు
* పార్టీలో పాల్గొన్న ఒకరికి డ్రగ్ పాజిటివ్
* ఏ1 గా కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జన్వాడ ఫామ్‌హౌస్(Janwada Farmhouse)లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీకి పలువురు వీఐపీలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. డీజే సౌండ్స్‌తో ఈ పార్టీని హోరెత్తిస్తున్న క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు(Cyberabad Sot Police).. జన్వాడ ఫామ్‌హౌస్‌లో దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు. విదేశీ మద్యం, లిక్కర్‌తో పాటు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందరికీ టెస్టులు చేయగా, విజయ్ మద్దూరి(Vijay Madduri)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
డ్రగ్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1 గా కార్తీక్(Karthik), ఏ2గా రాజ్ పాకాలా(Raj Pakala) ఉన్నారు. రాయదుర్గంలోని విల్లా నంబర్ 40లో ఉంటున్న రాజ్ పాకాలా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విల్లాకు తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. రాజ్‌పాకాల తమ అధీనంలో లేడని, పరారీలో ఉన్నాడని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ తెలిపారు. కేటీఆర్ బంధువు రాజ్‌పాకాలా ఫామ్ హౌస్‌లో నిన్న రాత్రి ఏం జరిగిందో సీసీ ఫుటేజీలు బయటపెట్టాలని, నిజాలు వెల్లడించాలని ఎంపీ రఘునందన్‌రావు(Mp RaghunandanRao) డిమాండ్ చేశారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
