* విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు
ఆకేరున్యూస్, వరంగల్: విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుకి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకొని ఆ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
