* సగం ఖాళీ అయిన నగరం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బతుకమ్మ, దసరా(Dasara) పండుగల నేపథ్యంలో నగర జనం పల్లెబాట పట్టారు. దీంతో మహానగరంలో బోసిపోయింది. దాదాపు 30 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జేబీఎస్(Jbs), ఎంజీబీఎస్(Mgbs) తదితర బస్టాండ్లు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి. సొంత, ప్రైవేటు వాహనాల్లో కూడా ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో రాజధాని నుంచి జిల్లాలకు వెళ్లే రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలో ఉన్న పంతంగి టోల్ ప్లాజావద్ద (Panthangi Toll Plaza) వాహనాలు క్యూకట్టాయి. పండుగ వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. అదేవిధంగా హైదరాబాద్-వరంగల్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా డిమాండ్‌కు సరిపడడం లేదు. దీంతో రైళ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. మరిన్ని అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
……………………………………….