* ప్రభుత్వం కీలక నిర్ణయం
* ఇక రతన్ టాటా పేరుతోనే ఇండస్ట్రియల్ అవార్డుల ప్రదానం..
ఆకేరున్యూస్, మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రతన్‌టాటా స్మార్థకార్థం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే టాటాగ్రూప్స్ దివంగత గౌరవ చైర్మన్‌కు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించిందిచగా.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ క్రమంలో ఆయన గౌరవార్థం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. పరిశ్రమలో విశేష కృషి చేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున ‘రతన్ టాటా ఉద్యోగ రత్న అవార్డు’ ఇవ్వనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. అలాగే, ముంబయిలోని ఉద్యోగ్ భవన్‌కు రతన్ టాటా ఉద్యోగ్ భవన్‌గా పేరు మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
