ఏపీ పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెం వద్ద ట్రావెల్ బస్సు బోల్తా
* మహిళ మృతి.. 20 మందికి గాయాలు
* ఆందోళన కలిగిస్తున్న వరుస ప్రమాదాలు
ఆకేరు న్యూస్, విజయవాడ : నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ ఒక్కరోజే తెలంగాణలోని రాజేంద్రనగర్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందితే, ఏపీలో ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. దాదాపు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అలాగే.. మధ్యప్రదేశ్లో జరిగిన ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 13 మంది దుర్మరణం చెందారు. కాగా, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా 19 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక నుంచి యానాం వెళ్తుండగా మార్గమధ్యలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై విరిగిపడిన చెట్టును తప్పించే క్రమంలో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో విజయవాడకు చెందిన నిమ్మగడ్డ దివ్య అనే మహిళ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారు.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
