– 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ లోని వైద్య విభాగంలో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్ మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్ బీ) బుధవారం ప్రకటన జారీ చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధాన పరిషత్ లో 183, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. 100 పాయింట్ల ద్వరా ఎంపిక విధానం ఉంటుందని, ఆన్లైన్ పరీక్షకు 80, ప్రభుత్వ సర్వీసులకు 20పాయింట్లు ఉంటాయని ఎంహెచ్ఎస్ఆర్ బీ వెల్లడించింది.
—————————-