ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దసరా, దీపావళి పండుగల ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరు ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని జోన్ సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ – తిరుపతి రైలు అక్టోబర్ 5 వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ప్రతి శనివారం బయల్దేరుతుంది. తిరుపతి – సికింద్రబాద్ రైలు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 12 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతుంది. తిరుపతి – శ్రీకాకుళం రోడ్ రైలు 6 వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ప్రతి ఆదివారం బయల్దేరుతుంది. శ్రీకాకుళం రోడ్ – తిరుపతి రైలు అక్టోబర్ 7 వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ప్రతి సోమవారం బయల్దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
