
– ప్రజల అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది మాకు ముఖ్యం
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బిజెపిలో చేరతాడేమోనని అనుమానంగా ఉంది
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డేట్లు దాటిన చెక్కులను ఇచ్చి లబ్ధిదారులను ఇబ్బందిపెడుతున్నాడు
– కౌశిక్ రెడ్డి రాబోయే ఎలక్షన్లలో ప్రజాదరణ కోసమే అక్రమ కేసులని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నాడు
– హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్ , కమలాపూర్: కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులేనని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వేరే పార్టీల వాళ్లు పార్టీని చీల్చాలని చిచ్చు పెడుతున్నారని హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం కమలాపూర్ లోని కమ్యూనిటీ హాల్ లో మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు 8,87,500/- లక్షల రూపాయల CMRF చెక్కులను వొడితల ప్రణవ్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గెలిచిన ఓడినా ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నామని, హుజురాబాద్ నియోజకవర్గానికి కౌశిక్ రెడ్డి ఐరెన్ లెగ్ లాగా తయారయ్యాడని,పనిచేయడం మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాడని విమర్శించారు.కళ్యాణ లక్ష్మి,సీఎంరిలీఫ్ ఫండ్ సంబంధించిన డేట్లు అయిపోయే దాకా చెక్కులు పంచకుండా ఎమ్మెల్యే ఏం పనిచేస్తున్నాడని అన్నారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన పడవద్దని, అధికారులతో మాట్లాడి తేదీ దాటిన చెక్కులకు మరల రీవాలిడేషన్ తో చెక్కులు ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు.ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3,500, మండలానికి 915 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, లబ్ధిదారుల్లో సగానికి పైగా మందికి ఒక లక్ష రూపాయలు అకౌంట్లో జమ అయ్యాయని ఆయన అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కూడా అందించలేకపోయిందని అన్నారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవకాశవాది అని, బిజెపిలో చేరుతాడేమోనని అనుమానంగా ఉందని అన్నారు.కౌశిక్ రెడ్డి తన ప్రవర్తన తీరు, వ్యవహార శైలి,ఇతరులను బెదిరించడం కారణంగానే పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయని పైగా ప్రజాదరణ కోసమే అక్రమ కేసులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో బ్యానర్లు పెడుతున్నాడని ఎద్దేవ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను పూర్తి చేస్తుందని అన్నారు.కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ తౌటం ఝాన్సీ రవీందర్,డైరెక్టర్లు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….