
* కేసు పెట్టండి సారూ …
* పోలీస్ స్టేషన్ కు వచ్చిన కోడి పంచాయితీ..
ఆకేరు న్యూస్ , నల్గొండ : మా కోడి కాళ్ళు విరగ్గొట్టారు. కేసు పెట్టండి. మీకు నవ్వోస్తుందా .. సారూ.. అంటూ కోడితో సహా పోలీస్ స్టేషన్కు చేరుకున్నది గంగమ్మ అనే వృద్దురాలు. ఊరన్నప్పుడు కోళ్ళు ఉండవా.. పశువులు ఉండవా అంత మాత్రం చేత కట్టెలతో కొడుతరా.. అంటూ ఆగ్రహం చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పశువులు పంట చేలు మేస్తేనే కట్టేసి పాయమాల్ ( జరిమానా) కట్టిస్తారు. ఇట్లా పశువుల కాళ్ళు విరగ్గొడుతరా.. కావాలంటే కోడి వాళ్ళ గడ్డి వాములోకి పోయినందుకు ఏదైనా జరిమానా కట్టమంటే కట్టేదాన్ని కదా.. ఇట్లా కాళ్ళు విరగ్గొడుతరా సార్, వాళ్ళకు శిక్ష పడాల్సిందే అంటూ పోలీసులతో వాదించింది . సరే రేపు మీ కోడి కాళ్ళు విరగ్గొట్టిన వాళ్ళను పిలిచి కేసు పెడతాం లే అని సముదాయించి ఇంటికి పంపించారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ పరిధిలోని గొల్ల గూడెంలో జరిగింది.
————————————-