
* కోట శ్రీనివాసరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి
* కోట గొప్పనటుడు అని కొనియాడిన చంద్రబాబు
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః సినీ నటుడు కోట శ్రీనివాస్ రావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఘనంగా నివాళులర్పించారు. కోటకు నివాళులర్పించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఫిల్మ్‌నగర్ లోని కోట నివాసానికి వెళ్లి పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి కోటకు ఘనంగా నివాళులర్పించారు. కోట చాలా అరుదైన నటుడు అని చంద్రబాబు అన్నారు. చిత్ర పరిశ్రమలో కోట లేని లోటు తీర్చలేనిదని అన్నారు. రాజకీయ నాయకుడిగా కోటా ప్రజలకు విశేషమైన సేవలను అందించాడని గుర్తుచేశారు. కోట కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
…………………………………………….