
* జ్యువెలరీ షాప్ లో చొరబడి కాల్పులు
* కూకట్ పల్లిలో రెండు ఇళ్లలో చోరీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ (HYDERABAD)లో దొంగలు రెచ్చిపోయారు. చందానగర్ లోని (CHANDANAGAR) ఓ నగల షాపులు చొరబడిన దుండగులు సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ(KHAJANA JWELERY) లో ఉదయం పదిన్నరకు షాప్ తెరువగానే ఒక్కసారిగా దుండగులుషాప్ లోకి దూసుకు వచ్చారు. ఒక్క సారిగా దుకాణంలోకి చొరబడ్డ దొంగలను దుకాణం సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించగా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది, మిగతా సిబ్బంది కూడా గాయపడ్డారు. అసిస్టెంట్ మేనేజర్ సతీష్ తో పాటు మిగతా సిబ్బందిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపలే దుండగులు పరారయ్యారు దుకాణంలో చోరీ జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.అలాగే కూకట్పల్లి ప్రాంతంలో ఈ ఉదయం రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు ఇళ్లలో కలిపి 2 లక్షల నగదుతో పాటు బంగారం చోరీకి గురైంది.
…………………………………….