
ఆకేరు న్యూస్, జమ్మికుంట : చదువుకున్న స్కూళ్లోనే టీచర్ గా పనిచేయడం అనేది ఓ గొప్ప అనుభూతి. తాము చదువుకున్న పాఠశాలలోనే ఏడుగురు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బొడిగల సమ్మయ్య, కట్కూరి వెంకట్ రెడ్డి, కొలుగురి సంపత్, మ్యాకమాల్ల శ్రీనివాస్, వట్టేపల్లి ప్రకాష్, రాం రాజయ్య, సంతోష్‌లు ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కావడం విశేషం. తాము విద్యార్థులుగా కూర్చున్న తరగతి గదిలోనే పాఠలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు ఆ ఉపాధ్యాయులు.
……………………………………….