* అడ్డుకున్న భద్రతా సిబ్బంది
* వాళ్లు ఎవరో ఆరా తీస్తున్న పోలీసులు
ఆకేరు న్యూస్ డెస్క్ : కొత్త సభ్యులతో పార్లమెంట్ (Parliament) సిద్ధమవుతున్న వేళ కలకలం రేగింది. పార్లమెంట్‌లోకి చొరబాటుకు దుండగులు యత్నించారు. నకిలీ ఆధార్ కార్డులు, ఐడీలతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. క్యాజువల్ ఎంట్రీ పాస్ తీసుకుని.. ముగ్గురు వ్యక్తులు గేట్ నెంబర్.3 నుంచి లోపలకు వెళ్లారు. అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని విచారణ చేపట్టారు. వారు నకిలీ ఆధార్‌తో వచ్చినట్లు గుర్తించారు. యూపీకి చెందిన ఖాసిం, మోనిస్, షోయబ్‌గా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల ముందు రోజు ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వారు ఎందుకు పార్లమెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారో పోలీసులు తెలుసుంటున్నారు.
—————–