
* తెలంగాణ భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు
* అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఇంచార్జిలు ఆనంద్ గౌడ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
………………………………………….