
* తెలంగాణ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు
* బీఆర్ ఎస్.. బీజేపీలకు తగిన బద్ది చెప్పారు
* తెలంగాణలో ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తోంది
* కాంగ్రెస్ అంటేనే పేదలకోసం పనిచేసే పార్టీ
* మోదీ అబద్దాల కోరు
* మోదీ మణిపూర్ను ఇంత వరకు సందర్శించలేదు
* మోదీకి ప్రచారంపై శ్రద్ధ ప్రజలపై లేదు
* ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలిచారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నర్వహించిన సమర భేరి కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక బలం,అధికార బలం ఉన్న కేసీ ఆర్ ను ఓడించితెలంగాణ ప్రజలు కేసీ ఆర్కు తగిన బుద్ది చెప్పారని అన్నారు.టీఆర్ ఎస్ ను గద్దె దించడంలో రేవంత్ మల్లు అందరూ కలిసి కష్ట పడ్డారు. బీజేపీ కేంద్రంలో ఉంది. అయినా కష్ట పడి గెలిపించారు. ఇద్దరినీ ఓడించి కాంగ్రెస్ ను గద్దెనెక్కించారు. అదే మీ గొప్పతనం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి ప్రజా ప్రభుత్వాన్ని పేదలే దళితులు మహిళల అభ్యన్నతి కోసం పని చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని ఖర్గే అన్నారు. కాంగ్రెస అధ్యక్షుడిని అయిన తరువాత నా మొట్ట మొదటి ప్రోగ్రాం హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడోలో పాల్గొన్నాను అప్పుడే మీ ఉత్సాహం చూసి తెలంగాణలో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని అనుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయని ఖర్గే అన్నారు. మోదీ 15 లక్షలు ఇస్తా అన్నారు ఇచ్చారా.. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తా అన్నారు. మోదీ మాట్లాడితే అన్నీ అబద్దాలే మాట్లాడుతారని ఖర్గే అన్నారు. ప్రజలను పిచ్చోళ్లు చేయడమే మోదీ నైజం అన్నారు. ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చాడు అని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన చాలా బాగా ఉందని ఖర్గే అన్నారు. రైతులకు 9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని ప్రశ్నిస్తారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టింది ఉండడానికి గూడు కల్పించింది. రాష్ట్రంలో ప్రతీ పేదలకు చిన్న చిన్న వ్యాపారులకు లేబర్లకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్దం చేసిందని త్వరలోనే అమలు చేస్తామని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ యే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా పేదలకోసమే పని చేస్తుందని రాహుల్ మాటిచ్చారని ఖర్గే అన్నారు. తెలంగాణలో బీసీ లకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కులగణన చేసి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. బీసీల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పోరాడుతుంది,రిజర్వేషన్లు అమలు అయ్యా వరకు కాంగ్రెస్ విశ్రమించకుండా పోరాడుతుందని ఖర్గే అన్నారు. అందరి సంక్షేమం కోసం కాంగ్రెస్ కు ఓటేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. మోదీ ఆయన మదిలో ఉన్నది మాట్లాడుతారు.. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనస్సులో ఉన్నది మాట్లాడుతుంది ఖర్గే అన్నారు. మోదీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోదీకి తగిన బద్ది చెప్పిందని ఖర్గే అన్నారు. హైదరాబాద్ లో 50 ప్రభుత్వ రంగ సంస్థలు నెహ్రూ , ఇందిరాగాంధి కాలంలోనే వచ్చాయని ఖర్గే అన్నారు. పహంల్గాం పై అఖిలపక్ష సమావేశాన్ని ఏరపటుచేయాలని కోరితే మోదీ బలవంతంగా అంగీకరించినా మోదీ ఆ సమావేశానికి రాలేదని ఖర్గే విమర్శించారు, మోదీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లారని అన్నారు. ఆయనకు ఓట్లపై ఉన్న శ్రద్ద ప్రజలపై లేదన్నారు. ప్రధానిగా దేశ దేశాలు తిరుగుతారు కాని మణిపూర్లో అగ్గిరగులుతున్నా అక్కడికి వెళ్లలేదని ఖర్గే విమర్శించారు. మణిపూర్ భారతదేశంలో అంతర్భాగం కాదా అని ఖర్గే ప్రశ్నించారు. దేశ ప్రజలను వదిలేసి ప్రపంచ నాయకుల చట్టూ తిరుగుతున్నారని ఖ ర్గే ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల పార్టీల అభిప్రాయాలకు మోదీ విలువ ఇవ్వడం లేదని ఖర్గే అన్నారు.మోదీ మీరు ఎందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చరు అని ఖర్గే ప్రశ్నించారు. రాజ్యాంగం నుండి సోషలిస్ట్, సెక్యులర్ అన్న పదాలను తొలగించాలని ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నిస్ఓతందని ఖర్గే అన్నారు. ఇది ఎవరి తరం కాదని ఖర్గే అన్నారు.ఈ సమర భేరిలో సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూఏటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,పీసీసీ చీఫ్,మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కార్పొరేషన్లు చైర్మన్లు గ్రామసస్థాయినుంచి మండల స్థాయి వరకు ఉన్న మొత్తం కాంగ్రెస్ కేడర్ పాల్గొన్నారు.
………………………………………..