* స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనపై మండిపాటు
* కేబినెట్ లో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్న
* అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసిందని మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (TPCC PRESIDENT MAHESH KUMAR GOUD) అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీతో సంప్రదించకుండా స్థానిక ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ప్రకటన చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ముందస్తు ప్రకటన సరికాదన్నారు. కేబినెట్ లో చర్చించకుండానే ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై మరొక మంత్రి ప్రకటించడం ఏంటని పొంగులేటి(Ponguleti) ని ప్రశ్నించారు. న్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. పార్టీతో సంప్రదించకుండా ఇకపై అలాంటి ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని సూచించారు. సున్నిత అంశాలపై ఏకాభిప్రాయం లేకుండానే మీడియాకు వెల్లడించడంపై అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసిందన్నారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
