* తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు
ఆకేరు న్యూస్, డెస్క్ : అయ్యప్ప మాల వేసుకున్న భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-కొల్లం (07107) రైలు నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, జనవరి 5, 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయని, ప్రతీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటాయని అధికారులు ప్రకటించారు. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి రైళ్లు కొల్లానికి వెళ్తాయని తెలిపారు. అలాగే.. కొల్లం-చర్లపల్లి (07108) (Kollam-Charlapalli)రైలు నవంబర్ 19, 26, డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటాయని.. ప్రతి బుధవారం ఉదయం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని వెల్లడించారు. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడె, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూర్, పాలక్కడ్, త్రిస్సూర్, అలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, కాయకులం స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించారు.
